డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్

  • Published By: madhu ,Published On : February 22, 2019 / 08:53 AM IST
డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్

Updated On : February 22, 2019 / 8:53 AM IST

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం శాసనసభలో సీఎం కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ముగిసిన తరువాత ఉభయసభలు ఫిబ్రవరి 23వ తేదీ శనివారానికి వాయిదా పడ్డాయి. అదే రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు. నోటిఫికేషన్‌తో పాటు నామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారని తెలుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్‌గా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును టీఆర్ఎస్ ఖరారు చేసింది. దీనితో ఆయన శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
Read Also:నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయింపు
గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మారావు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. జంట నగరాల్లో సీనియర్ నేతగా, మంత్రిగా మంచి గుర్తింపు ఉంది. సిటీలో ఓ సామాజికవర్గంలోనూ మంచి నేతగా ఉన్న పద్మారావుకు.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Read Also:తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు