తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: టిక్‌టాక్ ద్వారా ప్రజల్లోకి

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాను గట్టిగా వాడుకోవాలని భావిస్తుంది ప్రభుత్వం.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ‘టిక్ టాక్’ యాప్‌ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టిక్‌టాక్ ఇండియా.. తెలంగాణ ఐటీశాఖ, డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
హోటల్ హరి తప్లాజాలో ఈ మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రజా సంబంధాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిక్‌టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా, యువరాజ్, ఐటీ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొని ఎలా చేయవచ్చు అనేదానిపై వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఎం పీఆర్వో రమేశ్ హజారి, రాచకొండ కమిషనర్ పీఆర్వో దయాకర్, సైబరాబాద్ కమిషనర్ పీఆర్వో కిరణ్ కుమార్, డీజీపీ సీపీఆర్వో హర్ష భార్గవి పాల్గొన్నారు.