తెలంగాణ మంత్రుల స్పీడుకు బ్రేకుల్లేవ్: భారీగా పెండింగ్ లో ఫైన్ లు

  • Published By: vamsi ,Published On : September 24, 2019 / 04:33 AM IST
తెలంగాణ మంత్రుల స్పీడుకు బ్రేకుల్లేవ్: భారీగా పెండింగ్ లో ఫైన్ లు

Updated On : September 24, 2019 / 4:33 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ చట్టం అమలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర మంత్రుల వాహనాలే ట్రాఫిక్ ఉల్లంఘనలు పాటించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. పరిమితికి మించి వేగంగా వాహనాలు నడిపిన కారణంగా మంత్రుల వాహానాలకు భారీగా జరిమానాలు విధించబడ్డాయి. పోలీసు శాఖ కేటాయించిన వాహనాల వేగ పరిమితి వేగం 100 కి.మీ. దాటడంతో ట్రాఫిక్ పోలీసుల డేగకళ్లకు ఈ వాహనాలు చిక్కాయి. ఈ-చలానాలను పరిశీలిస్తే అన్నీ అధిక వేగానికి సంబంధించినవే.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు మాజీ ప్రజా ప్రతినిధులు వేగంగా వాహనాలు డ్రైవింగ్ చేసిన కారణంగా వారిపై ఫైన్ లు పడ్డాయి. తెలంగాన మంత్రులలో ఆర్థికమంత్రి టి హరీష్ రావు, ఇంధన మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. కొంతమంది మంత్రులు పదేపదే ఉల్లంఘనల కారణంగా దాదాపు 9,000 రూపాయలకు పైగా చలాన్లు పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్(ORR)లో ఎక్కువగా ఇవి గుర్తించారు. ప్రస్తుతం మోటారు వాహనాల చట్టం సెక్షన్ 184(బి) ప్రకారం అధిక వేగంతో ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే వాహనాలకు రూ.వెయ్యి జరిమానాను ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్నారు. ఐపీసీ-279 కింద ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే ఇతరుల ప్రాణాలకు ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ఆ వ్యక్తిని కోర్టులో కూడా హాజరుపరుస్తారు.

ఇంధన మంత్రి జగదీష్ రెడ్డి అధికారిక వాహనంకు  ఆగస్టు 26, 2018 తేదీ నుంచి జూన్ 24, 2019 వరకు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినందుకు 9,315రూపాయలు పెండింగ్ లో ఉంది. అదే విధంగా ఆర్థిక మంత్రి టీ హరీష్ రావు అధికారిక వాహనంపై తొమ్మిది చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 9,315 రూపాయలు పెండింగ్ లో ఉంది.  ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అధికారిక కారుకి 4,140 రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.