పంచాయతీ సమరం : బ్యాలెట్ పేపర్ ఎలా మడవాలి ?

హైదరాబాద్ : పంచాయతీ సమరం మొదలైపోయింది. మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నిక జనవరి 21వ తేదీ ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు జరుగనుంది. తరువాత 2గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడుతారు. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ జరుగనుంది. అయితే బ్యాలెట్ పేపర్ సరైన రీతిలో మడిచి కేటాయించిన బాక్సుల్లో వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.
రెండు కలర్స్ బ్యాలెట్ పేపర్లు
సర్పంచ్ అభ్యర్థి అయితే గులాబీ కలర్, వార్డు సభ్యుడయితే తెలుగు కలర్ బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. నచ్చిన వ్యక్తికి సంబంధించిన గుర్తుపై ఓటేసిన తరువాత పేపర్‌ను ఎడమ నుండి కుడికి మూడు మడతలు వచ్చేలా మడవాల్సి ఉంటుంది.
అనంతరం పై నుండి కిందకు మడవాలి. ఇలా చేసిన తరువాత సర్పంచ్‌కు కేటాయించిన బాక్సుల్లో గులాబీ కలర్ బ్యాలెట్ పేపర్…వార్డు సభ్యుడికి కేటాయించిన బాక్సుల్లో తెలుగు కలర్ పేపర్ వేయాల్సి ఉంటుంది.
ఇలా ఎందుకు చేయాలంటే ఒక గుర్తుకు వేసిన ముద్ర మరో గుర్తుపై పడే అవకాశం ఉందంట. ఇలా అయితే చెల్లని ఓటుగా పరిగణిస్తారు. సో..ఓటర్లు చాలా జాగ్రత్తగా ఓటు వేయండి.