నూతన సచివాలయం నిర్మాణంపై నిర్ణయానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయ నిర్మాణానికి డిజైన్లు, బడ్జెట్ పై తుది నిర్ణయం తీసుకోడానికి హై కోర్టు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై హై కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సచివాలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, ప్లాన్, ప్లాన్, బడ్జెట్‌పై తుది నిర్ణయం తీసుకోవచ్చునని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి 12 లోపు సమర్పించాలని అడ్వకేట్ జనరల్ ను హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12 కి వాయిదా వేసింది.