రవిప్రకాశ్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు

  • Published By: vamsi ,Published On : September 24, 2019 / 07:02 AM IST
రవిప్రకాశ్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు

Updated On : September 24, 2019 / 7:02 AM IST

రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. టీవీ9లో ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు తనపై కేసులు నమోదు చేయగా.. ఆయనపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు పెట్టిన షరతులను తొలగించాలని రవిప్రకాశ్ కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించి.. పిటిషన్‌ని కొట్టివేసింది హైకోర్టు. పోలీస్ స్టేషన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని రవిప్రకాశ్ సబ్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను కూడా తిరస్కరించింది హైకోర్టు.

టీవీ9ను టేకోవర్ చేసిన అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో వాటాల వివాదంలో.. సంస్ధ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్‌ ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద కంపెనీ డైరెక్టర్ పి.కౌశిక్ రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో రవిప్రకాశ్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనకు 41ఏ సీఆర్‌పీసీ కింద లుక్ అవుట్ నోటీసులు విడుదల చేసింది ప్రభుత్వం.