నేటి నుండి కంటి వెలుగు పథకం

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన పథకం “కంటివెలుగు”. కంటి వెలుగు శిబిరాలు రెండు రోజుల వారాంతపు సెలవుల అనంతరం నేటి(సోమవారం) నుంచి యథావిధిగా కొనసాగనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. నగరంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా నిరుపేదలు, వృద్ధులకు వైద్యంతో పాటు అద్దాలు అందించనున్నట్లు తెలిపారు. కంటి వైద్యం కోసం ఏ ఒక్కరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఉంచాలనే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కంటి వెలుగు పథకంకు సీఎం కేసిఆర్ బడ్జెట్ లో కూడా కేటాయింపులు చేశారు.