పంచాయతీ ఎన్నికలు : మంత్రివర్గ విస్తరణ చేయొచ్చు

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల కోడ్ కూయడంతో మంత్రివర్గ విస్తరణ ఉండదని..ఫిబ్రవరిలోనే విస్తరణ ఉంటుందనే ప్రచారంతో ఆశవాహులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. ఈ ఎన్నికలకు…కేబినెట్ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదని సీఎంవో కార్యాలయ అధికారులు స్పష్టం చేయడంతో ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పంచాయతీ రాజ్ చట్టంలోని అంశాలపై సీఎంవో, పంచాయతీ రాజ్ అధికారులతో నిపుణులు చర్చించారు. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత కేబినెట్ విస్తరణకు ఎలాంటి అడ్డంకులు లేవని తేల్చారు.
ఇద్దరే ప్రమాణం…
రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్…హోం మంత్రిగా మహమూద్ ఆలీ ప్రమాణ స్వీకారాలు చేశారు. తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. తమకు మంత్రి పదవులు దక్కాలని పలువురు లాబీయింగ్ జరిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు ఆశావాహులు క్యూ కట్టారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగా కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగినా..అదీ కాలేదు. సంక్రాంతి తరువాత విస్తరణ ఉంటుందని మరో ప్రచారం జరిగింది. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో వాయిదా పడుతుందని అనుకున్నారు. మంత్రివర్గ విస్తరణకు కోడ్ అడ్డుకాదని అధికారులు తేల్చడంతో విస్తరణ ఎప్పుడుంటదనే దానిపై ఉత్కంఠ నెలకొలంది.