ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు 

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 12:21 PM IST
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు 

Updated On : November 3, 2019 / 12:21 PM IST

ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు (నవంబర్ 3, 2019)న గతవిచారణలో జరిగిన వాదనలపై హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్ కె జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ కమిషనర్ లోకేష్ కుమార్.. ఈ నెల 7న కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆర్టీసీ సంస్థ ఇంచార్జ్‌ ఎండీ సునీల్ శర్మ ఇచ్చిన నివేదికపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ భేటి అనంతరం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగంలో చేరుతున్నారు కొందరు ఉద్యోగులు. పోలీసులు కూడా ఉద్యోగాల్లో చేరినవారికి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వడంతో విషయాన్ని గ్రహించిన ఉద్యోగులు తమ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఆయా డిపోల్లో సమ్మతి పత్రాలు ఇచ్చి, విధుల్లో చేరేందుకు సిద్దమయ్యారు కార్మికులు. నవంబర్ 5వ తేదీ వరకు సీఎం కేసీఆర్ విధుల్లో చేరేందుకు గడువు ఇవ్వగా రాష్ట్రవ్యాప్తంగా డిపోలకు చేరుకుంటున్నారు కార్మికులు. నెల రోజులుగా చేస్తున్న సమ్మెకు స్వచ్ఛందంగా గుడ్‌ బై చెప్పేసి డ్యూటీలో జాయిన్ అవుతున్నారు.

ఓ వైపు ఆర్టీసీ సంఘాలు సమ్మె ఉధృతం చేస్తామని ప్రకటిస్తుంటే… మరోవైపు కార్మికులు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు విధుల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఉద్యోగంలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు.