సకల సౌకర్యాలతో : కొత్త ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ రెడీ

హైదరాబాద్ : కొత్తగా కొలువు దీరిన శాసనసభ్యులకు కొత్త భ‌వ‌నాలు సిద్ధమ‌య్యాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఎమ్మెల్యేల నివాస స‌ముదాయాన్ని స్పీక‌ర్ పోచారం

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 06:09 AM IST
సకల సౌకర్యాలతో : కొత్త ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ రెడీ

Updated On : January 23, 2019 / 6:09 AM IST

హైదరాబాద్ : కొత్తగా కొలువు దీరిన శాసనసభ్యులకు కొత్త భ‌వ‌నాలు సిద్ధమ‌య్యాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఎమ్మెల్యేల నివాస స‌ముదాయాన్ని స్పీక‌ర్ పోచారం

హైదరాబాద్ : కొత్తగా కొలువు దీరిన శాసనసభ్యులకు కొత్త భ‌వ‌నాలు సిద్ధమ‌య్యాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఎమ్మెల్యేల నివాస స‌ముదాయాన్ని స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ప‌రిశీలించారు. త్వర‌లోనే ఎమ్మెల్యేలకు కొత్త భ‌వ‌నాల‌ను కేటాయిస్తామ‌ని వెల్లడించారు.

 

* నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌
* 6 ఏళ్ల క్రితం ప్రారంభమైన పనులు
* పూర్తయిన కొత్త భవనాల నిర్మాణం

 

తెలంగాణ శాసనసభ, మండలి సభ్యులకు అన్ని హంగుల‌తో కొత్త  భ‌వ‌నాలు సిద్ధమ‌య్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భ‌వ‌నాల‌ను కేటాయించేందుకు ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు స‌మీపంలోనే నాలుగున్నర ఎక‌రాల విస్తీర్ణంలో స‌క‌ల సౌక‌ర్యాల‌తో ఎమ్మెల్యేల నివాస స‌మూదాయం దాదాపు సిద్ధమైంది. ఆరేళ్ల క్రితం మొద‌లైన  నివాస స‌మూదాయం ప‌నులు తుది మెరుగులు అద్దుకుంటున్నాయి. 10 అంత‌స్తుల్లో కొత్త భ‌వ‌నాల నిర్మాణం పూర్తయింది. ఈ భ‌వ‌న స‌ముదాయాన్ని అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం ప‌రిశీలించారు.

 

* 120మంది ప్రజాప్రతినిధులను దృష్టిలో ఉంచుకొని భవనాల నిర్మాణం
* 2,500 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో ఒక్కో క్వార్టర్ నిర్మాణం

 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు వారితో ప‌నిచేసే సిబ్బందికి ఇదే స‌ముదాయంలో ఇళ్లను కేటాయించేందుకు అద‌నంగా భ‌వ‌నాల‌ను సిద్ధం చేశారు. 120మంది ప్రజాప్రతినిధుల‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేసిన ఈ స‌ముదాయానికి అన్నిసౌక‌ర్యాలు, భద్రతాప‌ర‌మైన ఏర్పాట్లను క‌ల్పిస్తున్నారు. 2వేల 500 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో ఒక్కో క్వార్టర్ నిర్మాణం జ‌రిగింది. త్వరలో శాస‌న‌స‌భ‌ ఎమినిటీ క‌మిటీని ఏర్పాటు చేసి.. నిబంధ‌న‌ల ప్రకారం కొత్త భ‌వ‌నాల కేటాయింపును  జ‌రుపుతామ‌ని పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు. కొత్త భ‌వ‌న స‌మూదాయానికి అనుబంధంగా సూప‌ర్ మార్కెట్, క్లబ్‌ హౌస్ లాంటి సౌక‌ర్యాల‌ను కూడా క‌ల్పిస్తున్నామ‌న్నారు.

 

* రూ.166 కోట్లతో నిర్మాణం
* 120 అపార్ట్‌మెంట్లు
* సిబ్బంది కోసం 12 అంతస్తుల భవనం
* ప్రతి అపార్ట్‌మెంట్‌లో విజిటర్స్ స్పేస్, ఆఫీస్ రూమ్, డ్రాయింగ్ రూమ్
* మాస్టర్ బెడ్‌రూమ్, మరో రెండు బెడ్‌రూమ్స్
* 240 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం
* 3BHK ఫ్లాట్లు