Supreeth Reddy: ఉబర్ డ్రైవర్‌పై ఛత్రపతి నటుడు దాడి.. ఫోన్ లాక్కుని హల్చల్.. కీసరలో కాట్రాజ్ రచ్చ
ఉబర్ క్యాబ్ డ్రైవర్‌పై నడిరోడ్డుపై దాడికి దిగిన ఛత్రపతి మూవీ నటుడు సుప్రీత్ రెడ్డి(Supreeth Reddy).
telugu actor supreeth reddy attack cab driver case registered at keesara police station
- ఉబర్ డ్రైవర్‌పై నటుడు కాట్రాజ్ దాడి.
- డ్రైవర్ మొబైల్ ఫోన్ లాక్కున్న సినీనటుడు.
- కీసర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
Supreeth Reddy: హైదరాబాద్‌లో సినీ నటుడి ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు కాట్రాజ్ అలియాస్ సుప్రీత్ రెడ్డి, ఓ సామాన్య ఉబర్ క్యాబ్ డ్రైవర్‌పై నడిరోడ్డుపై దాడికి దిగడం సంచలనం రేపింది. ఈ సంఘటనకు సంబంధించి కీసర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో సినీ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం, శనివారం డ్రైవర్ శ్రీహరి వనస్థలిపురం నుండి కుందనపల్లికి ప్రయాణికులను తన క్యాబ్‌లో సురక్షితంగా చేరవేశాడు.
ఆ తర్వాత మరో కిరాయి కోసం నాగారం సాయిబాబా ఆలయ సమీపంలోని ఒక గల్లీలో వాహనాన్ని నిలిపి వేచి చూస్తున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన నటుడు కాట్రాజ్(Supreeth Reddy), డ్రైవర్‌తో అనవసరంగా గొడవకు దిగి, నోటికొచ్చినట్లు తిడుతూ అతనిపై ఒక్కసారిగా భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి సమయంలో డ్రైవర్ శ్రీహరి మొబైల్ ఫోన్‌ను కూడా కాట్రాజ్ బలవంతంగా లాక్కున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే వచ్చి సర్దిచెప్పడంతో, నటుడు ఫోన్ తిరిగి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాధితుడు కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో డ్రైవర్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
