సూర్య ప్రతాపం : రామగుండంలో @ 40.4 డిగ్రీలు

  • Published By: madhu ,Published On : March 15, 2019 / 01:06 AM IST
సూర్య ప్రతాపం : రామగుండంలో @ 40.4 డిగ్రీలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎండలు విపరీతంగా ఉంటుండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఎండలకు తాళలేకపోతున్నారు. మార్చి 14వ తేదీ గురువారం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో అప్పుడే 40.04 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల, జగిత్యాల జిల్లా నేరెళ్ల, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో 40.2, నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 40 డిగ్రీలు, హైదరాబాద్‌లో సాధారణం కన్నా 2.5 డిగ్రీలు పెరిగి అధికంగా 37.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలో ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటాయోనని జనాలు భయపడిపోతున్నారు.