రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు : నారాయణ

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ శతృత్వం కాదని.. రాజకీయ విభేధాలు ఉన్నాయని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 11:36 AM IST
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు : నారాయణ

Updated On : October 1, 2019 / 11:36 AM IST

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ శతృత్వం కాదని.. రాజకీయ విభేధాలు ఉన్నాయని తెలిపారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక కొత్త పొత్తుకు నాంది పలికే అవకాశం ఉంది. సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే చాన్స్ ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ శతృత్వం కాదని.. రాజకీయ విభేదాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం (అక్టోబర్ 1, 2019) టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ తమకు చెప్పకుండా సీపీఎం అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. అందుకు తాము సానుకూలంగా లేమని చెప్పారు. తమకు సంబంధం లేకుండా ఆ పార్టీ నేతలు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అవమానకరంగా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు వచ్చి మద్దతు ఇవ్వాలని అడిగారని తెలిపారు. హుజూర్ నగర్ లో తమ పార్టీ ఓట్లు కీలకం కాబట్టి రెండు వైపులా తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 

ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో కొట్లాడామని.. తర్వాత ఆ పార్టీలతో కలిసి పని చేయాల్సివచ్చిందన్నారు. అలాగే టీఆర్ఎస్ తో కూడా కొట్లాడామని.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు వచ్చి తమను కలిశారని చెప్పారు. తమ పార్టీకి కొన్ని ఓట్లున్నాయని.. ఏం చేయాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. పొత్తులపై కాసేపట్లో నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. 

హుజూర్ నగర్ నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ అభ్యర్థి డా.కోట రామారావు, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి, టీడీపీ అభ్యర్థి కిరణ్మయి పోటీలో ఉన్నారు.