తెలంగాణలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం

తెలంగాణలో ఎండల మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
అదిలాబాద్ 42.5, భద్రాచలం 44, హన్మకొండ 42, హైదరాబాద్ 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఖమ్మం 44.8, మహబూబ్ నగర్ 40, మెదక్ 41.6, నల్లగొండ 44.5, నిజామాబాద్ 42.4, రామగుండం 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.