డాక్టర్ పల్లవి వర్మతో హీరో నిఖిల్ నిశ్చితార్థం

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకోబోతున్నారు. గత 5 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మతో పెళ్లికి సిద్దమయ్యాడు.
ఏపీలోని భీమవరానికి చెందిన పల్లవివర్మకు, ఆయన గోవాలో ప్రపోజ్ చేసి మెప్పించాడు. అంతేకాదు పెద్దల్ని కూడా ఒప్పించాడు. ఎక్కడైతే ప్రపోజ్ చేశాడో అక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. దీంతో శనివారం ఫిబ్రవరి1న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఇరువైపులా కుటుంబ సభ్యులు,సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హజరయ్యారు.
నిఖిల్, పల్లవి కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పల్లవి వర్మకు నిఖిల్ ప్రపోజ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెపుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కుడా నిఖిల్‌కు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.ఏప్రిల్ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం.
గతంలో మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించిన తెలుగు రియాల్టీషోలో మొదటి సారి నిఖిల్ తన ప్రేమను బయటపెట్టాడు. హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాతి కాలంలో మంచి హీరోగా పేరుతెచ్చుకున్నాడు. విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతూ ముందుకు వెళుతున్నాడు.
టాలీవుడ్‌లో నిఖిల్ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన అర్జున్ సురవరం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. గతంలో ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడిపోతావు చిన్నవాడా’, ‘కిరాక్ పార్టీ’ సినిమాలతో నిఖిల్ హిట్లు అందుకున్నారు. తాజాగా ఆయన ‘కార్తికేయ-2’లో నటిస్తున్నాడు.