నీతులు చెప్పడానికేనా : పెద్ద హీరోల తీరుపై తీవ్ర విమర్శలు

నీతులు ఉండేది పక్కోడికి చెప్పేందుకే అని అంటారు. దాన్ని నిజం చేశారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు. వాళ్లంతా పెద్ద పెద్ద హీరోలు, సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించారు.

  • Published By: veegamteam ,Published On : January 13, 2019 / 06:19 AM IST
నీతులు చెప్పడానికేనా : పెద్ద హీరోల తీరుపై తీవ్ర విమర్శలు

Updated On : January 13, 2019 / 6:19 AM IST

నీతులు ఉండేది పక్కోడికి చెప్పేందుకే అని అంటారు. దాన్ని నిజం చేశారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు. వాళ్లంతా పెద్ద పెద్ద హీరోలు, సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించారు.

హైదరాబాద్: నీతులు ఉండేది పక్కోడికి చెప్పేందుకే అని అంటారు. దాన్ని నిజం చేశారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు. వాళ్లంతా పెద్ద పెద్ద హీరోలు, సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించారు. సినిమాల్లో నీతులు చెబుతారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం అవేమీ పాటించరు. మ్యాటర్ ఏంటంటే.. ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్ చేసిన కొందరు పెద్ద హీరోలకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేశారు. అయితే ఆ చలాన్లను మాత్రం వాళ్లు పే చెయ్యడం లేదు. రెండు మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉంచారు. కట్టాల్సింది పెద్ద మొత్తమా అంటే అదీ కాదు. జస్ట్ వేల రూపాయలే. వాళ్లు అనుకుంటే పెద్ద లెక్క కాదు. కానీ ఆ అమౌంట్ కూడా చెల్లించలేకపోతున్నారు.

పెద్ద హీరోలు నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌ హీరోలు చెలాన్లు పెండింగ్ పెట్టిన వారి జాబితాలో ఉన్నారు. వారు ప్రయాణించిన వాహనాలు ఓవర్‌స్పీడ్‌, పార్కింగ్‌ నిబంధనలు ఉల్లఘించి ట్రాఫిక్‌ కెమెరాకు చిక్కాయి. దీంతో వీరి ఖాతాల్లో చలాన్లు పేరుకుపోయాయి.

* వీరిలో అత్యధికంగా మహేష్‌ 7సార్లు నిబంధనలు ఉల్లంఘించారు. మహేశ్ పేరుపై రూ.8,745 చలాన్లు ఉన్నాయి.
* 2016 నుంచి పెండింగ్‌లో ఉంచిన మహేష్
* 2018 మే లో నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు రాజేంద్రనగర్‌ వద్ద ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతో రూ.1035 ఫైన్‌ వేశారు.
* పవన్‌ కళ్యాణ్‌ వాహనం పార్కింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు 3 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
* 2016 నుంచి రూ.505 ఫైన్‌ను పవన్ చెల్లించలేకపోతున్నారు.
* సునీల్‌, నితిన్‌ లాంటి హీరోల చలాన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
* 10 చలాన్లు మించి పెండింగ్‌లో ఉన్నట్లైతే వాహనాలను సీజ్‌ చేస్తామని హైదరాబాద్‌ అదనపు ట్రాఫిక్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు.

పెద్ద హీరోల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయలు సంపాదించారు, సినిమాల్లో నీతులు చెబుతారు.. మరి నిజ జీవితంలో ఎందుకు పాటించడం లేదని నిలదీస్తున్నారు. సభ్య సమాజానికి, ఫ్యాన్స్‌కు ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు.. అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మన స్టార్ హీరోల్లో చలనం వచ్చి చలాన్లు పే చేస్తారో లేదో చూడాలి.