ఇంటర్ ఫలితాలు నేడే: ఈ వెబ్ సైట్ లలో చూసుకోండి

  • Published By: vamsi ,Published On : April 18, 2019 / 04:26 AM IST
ఇంటర్ ఫలితాలు నేడే: ఈ వెబ్ సైట్ లలో చూసుకోండి

Updated On : April 18, 2019 / 4:26 AM IST

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరిక్ష ఫలితాలు ఇవాళ(18 ఏప్రిల్ 2019) విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,42,719 లక్షల మంది విద్యార్థులు పరిక్షలు రాశారు. వీరిలో మొదటి సంవత్సరం నుంచి 4,52,550 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం నుంచి 4,90,169 మంది విద్యార్థులు ఉన్నారు. ఫలితాలను ‘TSBIE Services’ యాప్ లో చూడవచ్చు. అలాగే ఫలితాల కోసం https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని అధికారులు వెల్లడించారు.

ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు.. 
results.cgg.gov.in 
bie.tg.nic.in 
tsbie.cgg.gov.in
bie.telangana.gov.in 
exam.bie.telangana.gov.in