చిరంజీవి,నాగార్జునతో మంత్రి తలసాని భేటి

  • Published By: chvmurthy ,Published On : February 10, 2020 / 02:16 PM IST
చిరంజీవి,నాగార్జునతో మంత్రి తలసాని భేటి

Updated On : February 10, 2020 / 2:16 PM IST

తెలంగాణ రాష్ట్రంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై సినీ హీరోలు చిరంజీవి,నాగార్జునలతో  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ సమీక్షలో హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ,కార్మిక శాఖ  తదితర శాఖల అధికారులు పాల్గోన్నారు.  

శంషాబాద్ పరిసరాలలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ల  నిర్మాణం కోసం స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్ మెంట్ కేంద్రం నిర్మాణం కోసం కూడా  అవసరమైన స్థలాలు సేకరణ చెయాలి అని ఆయన ఆదేశించారు. సినీ, టి వి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని తలసాని చెప్పారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు  త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని తలసాని చెప్పారు. Fdc ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతామని.. పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు  తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని  మంత్రి ప్రకటించారు.