హైదరాబాద్‌లో త్వరలో మెట్రో సర్వీసులు రెడీ…. మరి సిటీ బస్సులు?

  • Published By: murthy ,Published On : September 2, 2020 / 07:26 AM IST
హైదరాబాద్‌లో త్వరలో మెట్రో సర్వీసులు రెడీ…. మరి సిటీ బస్సులు?

Updated On : September 2, 2020 / 10:25 AM IST

దేశంలో అన్ లాక్4 ప్రక్రియ మొదలైన తర్వాత సెప్టెంబర్ 1వ తేదీనుంచి కేంద్రం మరికొన్ని సడలింపులు ఇవ్వటంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి.  కొద్ది రోజల్లో మెట్రో రైలు సేవలు, ప్యాసింజర్ రైలు సేవలుకూడా ప్రారంభం కానున్నాయి. కానీ హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.



ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, సిటీ బస్సులు ఎప్పటి నుంచి నడపాలనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వం నుంచి సెప్టెంబర్1వతేదీ రాత్రి వరకు మౌఖిక ఆదేశాలు కూడా అందలేదని తెలుస్తోంది.
https://10tv.in/unlock-4-0-guidelines-hyderabad-metro-may-start/
‘కేంద్రం మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిటీ బస్సులు నడిపేందుకు మేం సిద్ధమయ్యాం. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఓకే అంటే బస్సులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే సర్వీసులు ప్రారంభించేందుకు సిధ్ధంగా ఉన్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు.



మెట్రో రైళ్లలో ప్రయాణికులను నియంత్రించేందుకు పూర్తి అవకాశం ఉంది. కానీ సిటీ బస్సుల విషయంలో అది సాధ్యం కాదు. కోవిడ్‌ కేసులు తీవ్రంగా పెరుగుతున్న సమయంలో, సిటీ బస్సుల్లో ప్రయాణికులు అదుపుతప్పితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఇప్పట్లో నడపకపోవడమే చిదన్న అభిప్రాయంతో ఉన్నారు.