అక్టోబర్ 19న తెలంగాణ బంద్
తెలంగాణలో వారం రోజులుగా టీఎస్ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.

తెలంగాణలో వారం రోజులుగా టీఎస్ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.
తెలంగాణలో వారం రోజులుగా టీఎస్ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. సమ్మెను ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, జేఏసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.
అక్టోబర్ 13న వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్థుల ర్యాలీలు, 17 న ధూందాం కార్యక్రమాలు, 18న బైకు ర్యాలీలు, 19న తెలంగాణ రాష్ట్ర బంద్ చేపట్టాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.
దశల వారీగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం (అక్టోబర్ 12, 2019) బస్ భవన్ దగ్గర పెద్ద ఎత్తున్న ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. వీరికి పలు పార్టీలు మద్దతు తెలిపాయి. బస్ భవన్ పైకి కార్మికులు, నేతలు ఎక్కడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.