టాలీవుడ్ లో విషాదం : గుండెపోటుతో సినీ నటి గీతాంజలి కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అలనాటి సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 01:33 AM IST
టాలీవుడ్ లో విషాదం : గుండెపోటుతో సినీ నటి గీతాంజలి కన్నుమూత

Updated On : October 31, 2019 / 1:33 AM IST

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అలనాటి సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అలనాటి సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బుధవారం(అక్టోబర్ 30,2019) రాత్రి 11.45 గంటలకు ఆమె మృతి చెందారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. గీతాంజలి అసలు పేరు మణి. సహనటుడు రామకృష్ణను గీతాంజలి వివాహం చేసుకున్నారు. కాకినాడలో జన్మించిన గీతాంజలి.. 1961లో ఎన్టీఆర్ సీతారాముల కల్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించారు.

శ్రీశ్రీ మర్యాదరామన్న, సీతారామకళ్యాణం, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, తోడ నీడ, లేత మనసులు, దేవత, శ్రీకృష్ణావతారం, ప్రాణమిత్రులు, పూలరంగడు, గూఢాచారి 116వంటి చిత్రాల్లో గీతాంజలి నటించారు. 

Read Also : గీతాంజలి మరణం – ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : ‘మా’ అధ్య‌క్షుడు వీకే న‌రేష్‌

చివరగా నాగార్జున నటించిన ‘భాయ్’ చిత్రంలో కనిపించిన గీతాంజలి.. తమన్నా నటించిన దటీజ్ మహాలక్ష్మిలోనూ నటించారు. ఈ చిత్రం ఇంకా విడుదల అవ్వలేదు. ఇక వీరి కుమారుడు ‘భూమ’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు.

నందినగర్ లోని నివాసానికి గీతాంజలి భౌతికకాయాన్ని తరలించారు. గీతాంజలి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.