వాహనదారులకు వార్నింగ్ : గీత దాటితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
హైదరాబాద్: ఇకపై వాహనంతో రోడ్డెక్కే వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ర్యాష్

హైదరాబాద్: ఇకపై వాహనంతో రోడ్డెక్కే వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ర్యాష్
హైదరాబాద్: ఇకపై వాహనంతో రోడ్డెక్కే వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, రూల్స్ బ్రేక్ చేసినా, ఓవర్ స్పీడ్‌తో వెళ్లినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా ఫలితం అనుభవించక తప్పదు. లైఫ్ లాంగ్ ఇక వాహనం నడిపే ఛాన్స్ కోల్పోవాల్సి ఉంటుంది.
రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై రవాణాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. భారీగా ఫైన్ విధించడంతోపాటు ఏకంగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారు. 2015 నుంచి 2019 ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 12వేల 369 డ్రైవింగ్ లైసెన్సులను రవాణాశాఖ సస్పెండ్ చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పదేపదే మద్యం తాగి పట్టుబడటం, సిగ్నల్స్ జంప్ చేయడం, ఓవర్‌లోడ్‌తో వెళ్లడం వంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ కాలంలో సంబంధిత వ్యక్తి రాష్ట్రంలో మరెక్కడా డ్రైవింగ్ లైసెన్సు తీసుకునేందుకు వీలు లేకుండా ఇతర శాఖలతో రవాణశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. నమోదైన మొత్తం కేసులను.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్యపు డ్రైవింగ్ క్యాటగిరీలుగా విభజించి చర్యలు తీసుకుంటున్నారు. తీవ్రమైన నేరాల్లో లైసెన్సును శాశ్వతంగా రద్దు చేస్తున్నారు.
* డ్రంకెన్ డ్రైవ్ కారణంగా లైసెన్సులు సస్పెండ్ అయిన కేసులు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ఎక్కువగానే ఉన్నట్టు తేలింది
* హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో 554 లైసెన్సులు సస్పెండ్
* పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ పరిధిలో 286 లైసెన్సులు సస్పెండ్
* హైదరాబాద్ నార్త్ జోన్ (199), వరంగల్ అర్బన్ (183), రంగారెడ్డి (121), హైదరాబాద్ ఈస్ట్‌జోన్ (111) లైసెన్సులు రద్దు
* మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ రూరల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, మేడ్చల్, ఉప్పల్, సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్ జిల్లాల్లోనూ లైసెన్సులు రద్దు
* ఓవర్‌లోడ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, పరిమితికి మించి ప్రయాణీకులకు తరలించిన కేసుల్లో.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,310 లైసెన్సులపై వేటు
* హైదరాబాద్ సౌత్‌జోన్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో సగటున 700-900 లైసెన్సులు సస్పెన్షన్
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు, రవాణా శాఖలు జాయింట్‌గా దాడులు కొనసాగిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్‌లో పోలీస్ శాఖ సిఫారసు చేసిన కేసులే అధికంగా ఉన్నాయి. పోలీస్‌శాఖ 8వేల 672 డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్‌కు సిఫారసు చేయగా, వీటిని రవాణాశాఖ అధికారులు పరిశీలించి 5వేల 034 లైసెన్సులను సస్పెండ్ చేశారు. మిగిలిన వారికి తుది హెచ్చరికల నోటీసులు జారీచేశారు.
కేసులు, సస్పెండ్ చేసిన లైసెన్సులు:
* డ్రంకెన్ డ్రైవ్-1846
* సెల్‌ఫోన్ డ్రైవింగ్-549
* ఓవర్ స్పీడ్-65
* సిగ్నల్ జంపింగ్-119
* ఓవర్‌లోడ్-2వేల 165
* ఇతర కారణాలు-290
* రవాణశాఖ 7వేల 362 లైసెన్సులను సస్పెండ్ చేసింది.
రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. కోర్టు తీర్పు ఆధారంగా ఆ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నారు. అదే వ్యక్తి మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడితే లైసెన్సును పర్మినెంట్‌గా రద్దు చేసే దిశగా ఆలోచిస్తున్నామని రవాణ శాఖ అధికారులు చెప్పారు. సో.. వాహనదారులు బీ కేర్ ఫుల్. ఇకపై బండితో రోడెక్కే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకోండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. లేదంటే.. ఆ తర్వాత చింతించినా ప్రయోజనం ఉండదు.