అక్టోబర్ 5 నుంచి సమ్మెకు వెళ్తాం : అశ్వత్థామరెడ్డి

కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 11:13 AM IST
అక్టోబర్ 5 నుంచి సమ్మెకు వెళ్తాం : అశ్వత్థామరెడ్డి

Updated On : October 2, 2019 / 11:13 AM IST

కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని… ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ఆర్టీసీ యూనియన్‌ నేతలతో సీనియర్‌ ఐఏఎస్‌ల కమిటీ సమావేశమైంది. వారి డిమాండ్లను పరిశీలించి… త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపింది. ముందుగా ఆర్టీసీ సీనియర్‌ అధికారులతో చర్చించిన కమిటీ సభ్యులు… ఆ తర్వాత యూనియన్‌ నేతలతో చర్చించారు. సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని… పండుగ సమయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

సీఎం కేసీఆర్‌ ఆర్టీసీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని సోమేష్‌కుమార్‌ అన్నారు. వీలైనంత త్వరగా ఆర్టీసీ నేతల డిమాండ్లపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. సమ్మె విషయంలో జేఏసీ నేతలు కొద్దిరోజులు ఓపిక పట్టాలని సూచించారు.

మరోవైపు కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని… ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎస్మాకు భయపడేది లేదన్నారు. తమ డిమాండ్లను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో నిర్దిష్టమైన గడువు చెప్పలేదని… ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ల కమిటీకి చట్టబద్ధత లేదన్నారు అశ్వత్థామరెడ్డి.