రాష్ట్రంలో పొడి వాతావరణం

రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కారణంగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.