బ్రేకింగ్, హైదరాబాద్‌లో క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న కరోనా లక్షణాలున్న మహిళ
హైదరాబాద్ లో కలకలం రేగింది. కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళ క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకుంది. ఆమె కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి వచ్చినట్లు పోలీసులు

హైదరాబాద్ లో కలకలం రేగింది. కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళ క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకుంది. ఆమె కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి వచ్చినట్లు పోలీసులు
హైదరాబాద్ లో కలకలం రేగింది. కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళ క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకుంది. ఆమె కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె చేతిపై ఉన్న క్వారంటైన్ గుర్తుని చూసిన పోలీసులు, ఆమెని కరోనా పేషెంట్ గా గుర్తించారు. పోలీసులు ఆమెని పట్టుకునే లోపే ఆమె పరార్ అయినట్టు తెలుస్తోంది. ఆ మహిళ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చిన మహిళ:
కరోనా లక్షణాలు కలిగి క్వారంటైన్ సెంటర్ లో ఉంటున్న ఓ మహిళ సోమవారం(మార్చి 2,2020) సాయంత్రం కోఠిలోని డీఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) ఆఫీస్ కు వచ్చింది. తనకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ కావాలని కోరింది. తన తల్లిదండ్రులతో కలిసి ఆమె ఆఫీస్ కి వచ్చింది. కాసేపటికి మహిళ గురించి తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిసరాల్లో మహిళ కోసం పోలీసులు గాలించారు. కానీ అప్పటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొన్ని పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కోఠి పరిసర ప్రాంతాల్లో మహిళ కోసం గాలిస్తున్నాయి.
పబ్లిక్ లో తిరుగుతున్న 72మందిపై కేసులు:
ఆ మహిళ ఏ క్వారంటైన్ సెంటర్ నుంచి వచ్చింది? ఎప్పటివరకు క్వారంటైన్ డేట్ ఉంది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. నిబంధనల ప్రకారం క్వారంటైన్ సెంటర్ లో ఉన్నవారు బయటకు రాకూడదు. అలా చేయడం నేరం. అయితే కొందరు నిబంధనలు ఉల్లంఘించి క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు వచ్చి తిరుగుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిబంధనలు ఉల్లంఘించి క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన పబ్లిక్ లో తిరుగుతున్న వారు 72మందిని ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వారిపై కఠినతరమైన కొవిడ్ -19 యాక్ట్ ప్రయోగించనుంది. ఇప్పటికే 72మంది లిస్ట్ ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ప్రిపేర్ చేసింది. వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి లిస్టును పోలీసుల శాఖ కూడా ఇచ్చారు. ఇప్పటికే కొత్తగూడెం డీఎస్పీపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. లండన్ నుంచి వచ్చిన కొడుకుని క్వారంటైన్ సెంటర్ లో ఉంచకుండా బయటకు పంపారని డీఎస్పీపై కేసు నమోదు చేశారు.