ఫిభ్రవరి 6 నుంచి ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ 

హైదరాబాద్ లో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ జరుగనుంది. ఐదురోజులపాటు నిర్వహించనున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 03:53 AM IST
ఫిభ్రవరి 6 నుంచి ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ 

Updated On : February 5, 2019 / 3:53 AM IST

హైదరాబాద్ లో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ జరుగనుంది. ఐదురోజులపాటు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ : నగరంలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ జరుగనుంది. ఐదురోజులపాటు నిర్వహించనున్నారు. ఫిభ్రవరి 6 నుంచి 10త తేదీ వరకు శిల్పారామంలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ను నిర్వహించేందుకు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం ఢిల్లీలో నిర్వహించేవారు. అయితే ఈసారి హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ తెలిపారు. ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ఏర్పాట్ల నేపథ్యంలో సోమవారం శిల్పారామంలోని సంప్రదాయ హాల్ లో సంచాలకులు బోయ విజయేందిరతో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహించి ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 150 మంది మహిళా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. సేంద్రియ రంగంలో కృషి చేస్తున్న మహిళలు ఇక్కడ ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసి.. సేంద్రియ సాగు ఉత్పత్తులు, విత్తనాలు, బేకరీ ఉత్పత్తులు, తినుబండారాలను ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. 5 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టాళ్లు తెరిచి ఉంటాయని చెప్పారు.