కార్మికులెవరూ ప్రాణత్యాగాలు చేయొద్దు : అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని..టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా పోరాటం చేయాలన్నారు.

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 12:31 PM IST
కార్మికులెవరూ ప్రాణత్యాగాలు చేయొద్దు : అశ్వత్థామరెడ్డి

Updated On : October 13, 2019 / 12:31 PM IST

ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని..టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా పోరాటం చేయాలన్నారు.

ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని..టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా పోరాటం చేయాలన్నారు. అంతిమ విజయం కార్మికులదేనని అన్నారు. ఈమేరకు ఆదివారం (అక్టోబర్ 13, 2019) హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులు అమ్మేవారు ఒకవైపుంటే…ఆస్తులను కాపాడుకునే వైపు మనమున్నామన్నారు. తమందరికీ తెలంగాణ పౌర సమాజం మద్దతు ఉందన్నారు. కార్మికులు మనో నిబ్బరంతో ఉండాలన్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని చెప్పారు. నిలబడి, కలబడి గెలుద్దామని తెలిపారు. 

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, టీఎన్ జీవోలు, టీజీవోలు, రెవెన్యూ, ఎమ్మార్వో, వీఆర్ వో, మండల పరిషత్ లు భారీ ఎత్తున సంఘీభావం తెలిపాలని కోరారు. తమ న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలన్నారు. ఇవాళ అన్ని డిపోల ఎదుట కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టాలన్నారు. సోమవారం (అక్టోబర్ 14, 2019) ఉదయం 10 గంటలకు అన్ని డిపోల ఎదుట శ్రీనివాస్ రెడ్డి సంతాప సభలు నిర్వహించాలని, నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మరణించాడు. హైదరాబాద్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 2019, అక్టోబర్ 13వ తేదీ ఆదివారం కన్నుమూశాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా నెలకొన్న పరిణామాలాతో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అక్టోబర్ 12వ తేదీ శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడనే ఉన్న వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే 90 శాతానికి పైగా శరీరం కాలిపోయింది.

చికిత్స కోసం అతన్ని వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వమే కారణమని కార్మికులు అంటున్నారు.