కేటీఆర్ – జగన్ భేటీ : ఫెడరల్ ఫ్రంట్‌కు స్వాగతం – జగన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు…ఫెడరల్ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రకటించారు. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్‌లో జగన్ – కేటీఆర్ బృందాల మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
జగన్ మాట్లాడుతూ….కేసీఆర్ తనతో ఫొన్‌లో మాట్లాడడం జరిగిందని..ఈ సందర్బంగా తారక్ వచ్చి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించడం జరిగిందన్నారు. అన్యాయం జరుగకండా రాష్ట్రాలు నిలబడాల్సినవసరం ఉందని..రాష్ట్రాలు కలిసి రావాల్సినవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేసినా కేంద్రం స్పందించలేదన్నారు. 25 మంది ఎంపీలతో హోదా డిమాండ్ చేసినా పట్టించుకోలేదన్న జగన్…ఈ ఎంపీలకు తోడు తెలంగాణ ఎంపీలు తోడు కావాలన్నారు. రాష్ట్రాలపై జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే…మేలు జరుగుతుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ స్వాగతించాల్సిందేనని..రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే ఎంపీల సంఖ్య పెరగాల్సినవసరం ఉందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రతిపాదించిన జాతీయ ఫ్లాట్ ఫాంను స్వాగతిస్తున్నట్లు..త్వరలోనే కేసీఆర్ కూడా వచ్చి కలుస్తామని చెప్పడం జరిగిందని…ఫెడరల్ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామన్నారు. కేటీఆర్‌తో చర్చించిన అంశాలపై పార్టీలో విస్తృతంగా చర్చిస్తామని వైఎస్ జగన్ వెల్లడించారు.