Ajit Agarkar Love Story : బీసీసీఐ కొత్త సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్, ముస్లిం గాళ్‌ఫ్రెండ్ ప్రేమ కథ

భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ ప్యానల్ ఛైర్మన్ గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ఎంపికవడంతో కీలక వార్తల్లో నిలిచారు. అజిత్ అగార్కర్ సామాజిక ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడి తన చిరకాల ముస్లిం గాళ్ ఫ్రెండ్ అయిన ఫాతిమాను వివాహం చేసుకున్నారు....

Ajit Agarkar Love Story : బీసీసీఐ కొత్త సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్, ముస్లిం గాళ్‌ఫ్రెండ్ ప్రేమ కథ

Ajit Agarkar Love Story

Ajit Agarkar Love Story : భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ ప్యానల్ ఛైర్మన్ గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ఎంపికవడంతో కీలక వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చేతన్ శర్మ రాజీనామాతో ఏర్పడిన చీఫ్ సెలెక్టర్ పోస్టులో అపార అనుభవం ఉన్న అగార్కర్ ను బీసీసీఐ ఎంపిక చేయడం విశేషం. ఎక్కువ టెస్టుమ్యాచ్‌లు ఆడిన అగార్కర్ కు బీసీసీఐ అత్యధికంగా ఏడాదికి రూ.3కోట్ల వేతనం ఆఫర్ చేసింది. భారత జట్టు తరపున 26 టెస్టు మ్యాచ్ లు, 191 వన్డేలు, నాలుగు టీ20 లు ఆడిన అగార్కర్ వ్యక్తిగత జీవితంలోనూ విజయం సాధించారు.

ప్రేమకథ సక్సెస్…

అజిత్ అగార్కర్ సామాజిక ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడి తన చిరకాల ముస్లిం గాళ్ ఫ్రెండ్ అయిన ఫాతిమాను వివాహం చేసుకున్నారు. అగార్కర్, ఫాతిమాల ప్రేమ కథ ప్రత్యేకమైనది. తన స్నేహితురాలైన ఫాతిమాను వివాహం చేసుకోవడానికి అగార్కర్ సామాజిక ఆచార వ్యవహారాలపై పోరాడారు. అగార్కర్ ప్రాణ స్నేహితుడి సోదరి అయిన ఫాతిమా పట్ల మనసు పారేసుకున్నాడు. ఆమె పూర్తి పేరు ఫాతిమా ఘడియల్లీ.

Ajit Agarkar

Ajit Agarkar

ప్రేమించి పెళ్లాడాడు…

అజిత్ మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అటువంటి అగార్కర్ ముస్లిం యువతి అయిన ఫాతిమాను ప్రేమించి పెళ్లాడటం విశేషం. ఈయన తన ప్రేమను గెలిపించుకొని 2002వ సంవత్సరంలో ఫాతిమాను వివాహమాడారు. వివాహం కోసం సామాజిక ఆచారాలను ఉల్లంఘించి కుటుంబం నుంచి పలు విమర్శలను సైతం ఎదుర్కొన్నాడు. అజిత్, ఫాతిమా దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి రాజ్ అని పేరు పెట్టారు.

విద్యాధికురాలు…ఫాతిమా

ముంబయి నగరానికి చెందిన ఫాతిమా వృత్తిరీత్యా విద్యావేత్త. ఈమె పిల్లల కోసం సెవెన్ అసోసియేట్స్ పేరిట స్పోర్ట్సు ఎడ్యుకేషన్ సంస్థను స్థాపించారు. ఫాతిమా క్వీన్ మేరీ హైస్కూల్ లో పాఠశాల విద్య, సిడెన్ హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బీకాం చదివారు. అనంతరం బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయంలో స్ట్రాటజిక్ మేనేజ్ మెంట్ , మార్కెటింగ్ లో ఎంబీయే చదివారు. బీసీసీఐలో కీలక పదవిని కైవసం చేసుకొని ప్రధాన వార్తల్లో నిలిచిన అగార్కర్ తన పాత ప్రేమ కథ తాజాగా మీడియాలో వెలుగులోకి రావడంతో అది కాస్తా వైరల్ గా మారింది.