కొకైన్‌తో పట్టుబడ్డ బీజేపీ యువ మోర్చా లీడర్లు

arrest
BJP Yuva Morcha leaders: రాజకీయ పార్టీకి చెందిన నాయకులు.. మత్తుమందుతో పట్టుబడ్డారు. సమాజసేవలో భాగం కావాల్సిన వాళ్లు చెడు ప్రభావానికి కారణమవుతుండటంతో పోలీసులు వారిపై కన్నేసి పట్టుకోగలిగారు. పశ్చిమబెంగాల్ పోలీసులు కోల్‌కతాలోని బీజేపీ యువ మోర్చా లీడర్లను న్యూ అలీపురెలో ఇద్దరిని అరెస్టు చేశారు.
పమీలా గోస్వామి, ప్రబీర్ దే అనే ఇద్దరి వ్యక్తుల నుంచి 100గ్రాముల కొకైన్ రికవరీ చేశారు. ఈఘటనకు సంబంధం ఉందనే అనుమానంతో సోమ్‌నాథ్ ఛటర్జీ(26)ని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 90గ్రాముల నార్కోటిక్ మెటేరియల్ ను సీజ్ చేశామని పోలీసులు ఎఫ్ఐఆర్ చేసినట్లు వెల్లడించారు.