ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్న 5 రాష్ట్రాలు

how-fuel-went-from-centres-expense-to-a-big-revenue-source1
Fuel Rates before elections: ఎన్నికలకు ముందు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత పాంత్రంతో కలిపి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇందన ధరలు తగ్గించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తాము విధించే ట్యాక్స్ ను తగ్గించాలనుకుంటోందట. ఆకాశన్నంటుతోన్న ఇందన ధరల అంశంపై ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్ చేసి ఆడుకుంటున్నాయి.
ఇదే క్రమంలో పబ్లిక్ సెక్టార్ ఫ్యూయెల్ అమ్మకదారులు కూడా ధరలు తగ్గించాలనే అనుకుంటున్నారు. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 70డాలర్ల కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఓ 9రోజుల నుంచి ధరలలో మార్పులు కనిపించడం లేదు.
కొద్ది నెలలుగా ఇందన ధరలు పెరిగిపోతూ లీటర్ వందరూపాయలంటే అమ్మో అనుకునే స్థాయి నుంచి అలవాటైయ్యే స్థాయికి మారిపోయింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలోనే అధిక ధరలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా డీజిల్ ధర లీటరుకు రూ.80కు పెరగడంతో ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జిలు ఆటోమేటిక్ గా పెంచేశారు.
రాష్ట్రానికి, కేంద్రానికి పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్స్ లు విధించడం ముఖ్యమైన ఆర్థిక వనరు. కొవిడ్-19 మహమ్మారి తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ తీసుకురావడం అనేది తప్పనిసరి అయిపోయింది. ఒకవేళ ఇందన ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకుంటే అత్యధిక పన్ను కింద సంవత్సరానికి రూ.2.5లక్షల కోట్లు మేర నష్టం వాటిల్లింది.