COVID-19 UPDATE: దేశంలో 2,149 కరోనా యాక్టివ్ కేసులు: కేంద్రం

దేశంలో కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతం ఉన్నట్లు తెలిపింది. కరోనా నుంచి నిన్న 182 మంది కోలుకున్నారని వివరించింది.

COVID-19 UPDATE: దేశంలో 2,149 కరోనా యాక్టివ్ కేసులు: కేంద్రం

CORONA

Updated On : January 15, 2023 / 12:44 PM IST

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతం ఉన్నట్లు తెలిపింది. కరోనా నుంచి నిన్న 182 మంది కోలుకున్నారని వివరించింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.07 శాతం, వారాంతపు పాజిటివిటీ రేటు 0.10 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,48,165గా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు వేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 220.17 కోట్లకు చేరిందని వివరించింది. అందులో రెండో డోసుల సంఖ్య 95.14 కోట్లు, ప్రికాషన్ డోసుల సంఖ్య 22.45 కోట్లుగా ఉందని చెప్పింది.

నిన్న దేశ వ్యాప్తంగా 23,490 డోసుల వ్యాక్సిన్లు వాడినట్లు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 91.32 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 1,52,825 పరీక్షలు చేసినట్లు చెప్పింది. చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ భారత్ లో వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉండడం దేశ ప్రజలకు ఊరటనిస్తోంది.

Chicken Bettings In AP : ఆంధ్రప్రదేశ్ లో జోరుగా కోడి పందాలు.. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు బేఖాతరు