Chicken Bettings In AP : ఆంధ్రప్రదేశ్ లో జోరుగా కోడి పందాలు.. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు బేఖాతరు

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కోడి పందాలు యమ జోరుగా సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. 

Chicken Bettings In AP : ఆంధ్రప్రదేశ్ లో జోరుగా కోడి పందాలు.. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు బేఖాతరు

Chicken bettings

Chicken Bettings In AP : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కోడి పందాలు యమ జోరుగా సాగుతున్నాయి. గ్రామ శివారులో శిబిరాలు ఏర్పాటు చేసుకుని కోడి పందాలు నిర్వహిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ ను తలపించేలా ప్లడ్ లైట్ వెలుగుల్లో కోడ పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలతోపాటు గుండాట, పేకాట, లోన బయట, పెద్ద బజార్, చిన్న బజార్ లను కూడా నిర్వహిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలను పందెం రాయుళ్లు పట్టించుకోవడం లేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో భారీగా కోడి పందాల సందడి కనిపించింది. ఏలూరు జిల్లాలో కోడి పందాలు డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ లను తలపించాయి. చీకటి పడ్డాక కూడా కోడి పందాలు కొనసాగాయి. ప్లడ్ లైట్ల వెలుగులో పందాలు నిర్వహించారు. కోడి పందాలను చూసేందుకు సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తరలివచ్చారు. కోడి పందాలు శిబిరాల వద్ద మద్యం, మాంసం వంటి అన్ని సదుపాయాలను నిర్వహకులు కల్పించారు.

Chicken Bettings : తొలి రోజు జోరుగా కోడి పందాలు.. రూ.300 కోట్లకు పైగా చేతులు మారిన డబ్బు

దీంతో కోడి పందాల్లో పాల్గొంటున్న వారు శిబిరాల వద్దే మద్యం తాగుతూ మాంసం తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కోడి పందెం స్థావరాల వద్ద మద్యం ఏరులైపారుతోంది. పందాలను చూసేందుకు ఎల్ ఈడీ స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా చూసిచూడనట్లుగా వ్యవహరించడంతో పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. కోడి పందెం, గుండాటలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.200 చేతులు మారినట్లు సమాచారం. కోడి పందాల మాటున విజయవాడలో క్యాసినో నిర్వహించారు. అంబాపురంలో బయట కోడిపందాలు జరుగుతుండగా లోపల క్యాసినో జూదం కొనసాగింది. బరి మధ్యలో క్యాసినో డేరే ఏర్పాటు చేసి సెక్యూరిటీగా నిర్వహికులు బౌన్సర్లను పెట్టారు.  పాస్ ఉన్నవారిని పూర్తిస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విచ్చలవిడిగా జూదం, అడ్డూ అదుపు లేకుండా మద్యం సరఫరా చేశారు.

Cock Fight : రంగారెడ్డి జిల్లాలో బహిరంగ కోడి పందాలు.. పది మంది అరెస్ట్

కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కోది పందాలను రహస్య స్థావరాల్లో నిర్వహించారు. కోడిపందాల ముసుగులో జోరుగా గుండాట, పేకాట సాగాయి. కొవ్వూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల పోటీలు నిర్వహించారు. రామచంద్రాపురం మండలం అనుపల్లిలో జల్లి కట్టు నిర్వహించారు. ఎద్దులను లొంగ దీసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. జల్లి కట్టులో పలువురు గాయపడ్డారు.