Cyclone Biparjoy sattilite Pics: ట్విట్టర్‌లో వెలుగుచూసిన బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత శాటిలైట్ చిత్రాలు

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో తీసిన శాటిలైట్ చిత్రాలు ట్విట్టరులో వెలుగుచూశాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత చిత్రాలు తీశారు....

Cyclone Biparjoy sattilite Pics: ట్విట్టర్‌లో వెలుగుచూసిన బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత శాటిలైట్ చిత్రాలు

Cyclone Biparjoy sattilite Pics

Updated On : June 15, 2023 / 12:21 PM IST

Cyclone Biparjoy sattilite Pics: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో తీసిన శాటిలైట్ చిత్రాలు ట్విట్టరులో వెలుగుచూశాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) నుంచి బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత చిత్రాలు తీశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాది అరేబియా సముద్రం మీదుగా కదులుతున్న తుపాన్ ప్రభావం చిత్రాలను తన ట్విట్టర్(twitter) ఖాతాలో పోస్ట్ చేశారు. (Cyclone Biparjoy sattilite Pics)

Cyclone Biparjoy To Hit Pakistan: పాకిస్థాన్‌ను తాకిన బిపర్‌జోయ్ తుపాన్..సింధ్ తీరప్రాంతాల్లో 66వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

‘‘నా మునుపటి వీడియోలో వాగ్దానం చేసినట్లుగా అరేబియా సముద్రంలో ఏర్పడిన (#Biparjoy) బిపర్ జోయ్ తుపాన్ చిత్రాలను నేను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రెండు రోజుల పాటు క్లిక్ చేశాను’’ అని అల్ నెయాడి రాశారు.రెండు రోజుల క్రితం అల్ నెయాడి అరేబియా సముద్రం మీదుగా భారత తీరం వైపు వెళుతున్నప్పుడు ఏర్పడిన భారీ తుపాన్ ను చూపించే వీడియోను పంచుకున్నారు. ‘‘అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్ చూడండి… సురక్షితంగా ఉండండి’’అంటూ అల్ నెయాడి ట్వీట్ చేశారు.

Cyclone Biparjoy To Hit Pakistan: పాకిస్థాన్‌ను తాకిన బిపర్‌జోయ్ తుపాన్..సింధ్ తీరప్రాంతాల్లో 66వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల నుంచి 74,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గురువారం సాయంత్రం కచ్‌లో తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో ఐఎండీ అధికారులు గుజరాత్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుపాన్ ఓఖౌ పోర్ట్ సమీపంలో మాండ్వి మరియు కరాచీ మధ్య ల్యాండ్‌ఫాల్ చేస్తుంది.

Biparjoy: అరేబియా సముద్రంలో ఎక్కువ కాలం కొనసాగిన బిపర్‌జోయ్.. గుజరాత్‌ను తాకిన మూడో తుఫాన్

తుపాను కారణంగా గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు ఆ పక్కనే ఉన్న పాకిస్థాన్ తీరంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.తీవ్ర తుపాన్ ప్రభావం వల్ల గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.