Rajasthan Cyclone Biparjoy: అతి భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదలు, ఏడుగురి మృతి
గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన బిపర్‌జోయ్ తుపాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రళయం సృష్టిస్తోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో బార్మేర్, సిరోహి, బాన్స్ వారా, ఉదయపూర్ జిల్లాల్లో వరదలు జన నివాస ప్రాంతాలను ముంచెత్తాయి....

రాజస్థాన్ రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీవర్షాలు
Rajasthan Cyclone Biparjoy: గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన బిపర్‌జోయ్ తుపాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రళయం సృష్టిస్తోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో బార్మేర్, సిరోహి, బాన్స్ వారా, ఉదయపూర్ జిల్లాల్లో వరదలు జన నివాస ప్రాంతాలను ముంచెత్తాయి. పలు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోంది.(Rajasthan battling heavy rain, floods) పలు ఇళ్లను వరదనీరు చుట్టుముట్టడంతో జన జీవనం స్తంభించి పోయింది.జాలోర్, బార్మేర్, సిరోహి జిల్లాల్లో అతి భారీవర్షాలు, తుపాన్ వల్ల 94 వేల మందిని సురక్షితప్రాంతాలకు తరలించారు.
Heavy Rainfall in Tamil Nadu: పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. తమిళనాడులో స్కూళ్లకు సెలవులు
అజ్మేర్ నగరంలో అత్యధికంగా 100.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.భారీ వర్షాల వల్ల ఏడుగురు మరణించారు.(7 Rain Related Deaths)అల్పపీడనం కారణంగా అత్యంత భారీ వర్షపాతం కారణంగా సహాయక దళాలు 265 మందిని రక్షించాయని అధికారులు తెలిపారు.8,700 కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయని, 8,500 విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, 2,000 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని, 225 ప్రభుత్వ పాఠశాల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని రాజస్థాన్ అధికారులు తెలిపారు.
Army rescues tourists: ఉత్తర సిక్కింలో వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను కాపాడిన ఆర్మీ
1000 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు.పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. సురవ డ్యామ్ డ్యామ్ వరదనీటితో నిండి పొంగి ప్రవహిస్తుండటంతో 15కిలోమీటర్ల దూరంలోని సాన్ చోరీ పట్టణంలోకి వరదనీరు వచ్చింది. దీంతో ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో మరో 36 గంటల పాటు అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.తుపాన్ దక్షిణ రాజస్థాన్ వైపు పయనిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. సవాయిమాధోపూర్, బరన్, కోటా జిల్లాల్లోని వివిక్త ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, బుండి, టోంక్, ఝలావర్, కరోలి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం తెలిపింది.