Army rescues tourists: ఉత్తర సిక్కింలో వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను కాపాడిన ఆర్మీ

ఉత్తర సిక్కింలో భారీవర్షాలు, వరదల్లో చిక్కుకుపోయిన 3వేలమందికి పైగా పర్యాటకులను భారత సైనికులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.నార్త్ సిక్కింలో ఒక్కసారిగా వెల్లువెత్తిన వరదలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.....

Army rescues tourists: ఉత్తర సిక్కింలో వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను కాపాడిన ఆర్మీ

పర్యాటకులను రక్షించిన ఇండియన్ ఆర్మీ

Army rescues tourists in North Sikkim: ఉత్తర సిక్కింలో భారీవర్షాలు, వరదల్లో చిక్కుకుపోయిన 3వేలమందికి పైగా పర్యాటకులను భారత సైనికులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.నార్త్ సిక్కింలో ఒక్కసారిగా వెల్లువెత్తిన వరదలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డు మార్గం తెగిపోయి చిక్కుకుపోయిన పర్యాటకులను తీసుకువచ్చేందుకు సైనికులు రంగంలోకి తాత్కాలిక క్రాసింగ్ ఏర్పాటు చేశారు. ఉత్తర సిక్కింలో కుండపోత వర్షం కురిసింది.(North Sikkim due to inclement weather)దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి.

Cyclone Hits Brazil: బ్రెజిల్‌ను తాకిన తుపాన్..11మంది మృతి, 20 మంది అదృశ్యం

వరదనీటి ధాటికి కొండచరియలు విరిగిపడటం వలన రహదారి అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రతికూల వాతావరణం కారణంగా చుంగ్తాంగ్ సమీపంలోని వంతెన కొట్టుకుపోయింది. దీంతో దాదాపు 3,500 మంది పర్యాటకులు(3,500 tourists) ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు.స్ట్రైకింగ్ లయన్ డివిజన్, త్రిశక్తి కార్ప్స్, ఇండియన్ ఆర్మీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

No extramarital affairs: వివాహేతర సంబంధాలు, విడాకులపై నిషేధాస్త్రం..చైనా కార్పొరేట్ కంపెనీ వినూత్న నిబంధన

పర్యాటకులు నదిని దాటడానికి సహాయం అందించారు. పర్యాటకులకు వేడి వేడి భోజనం వడ్డించి, గుడారాల్లో వైద్య సహాయం అందించారు.హిమాలయాలలోని అతి ఎత్తైన ప్రాంతాలలో సరిహద్దును కాపాడుతున్న భారత సైనికులు… పర్యాటకులకు, స్థానిక ప్రజలకు సహాయం అందిస్తున్నాయి.వరదల వల్ల 10వ నంబర్ జాతీయ రహదారిని మూసివేశారు.