Man arrested for carrying Firecrackers: ఢిల్లీలో బాణసంచాతో తిరుగుతున్న వ్యక్తి అరెస్టు

ఢిల్లీలో బాణసంచా తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మొహమ్మద్ మర్షుల్ (29) అనే వ్యక్తి 103 కిలోల బాణసంచాను తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ బాణసంచాను విక్రయించాలని భావించాడు.

Man arrested for carrying Firecrackers: ఢిల్లీలో బాణసంచాతో తిరుగుతున్న వ్యక్తి అరెస్టు

Updated On : October 14, 2022 / 3:08 PM IST

Man arrested for carrying Firecrackers: ఢిల్లీలో బాణసంచా తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మొహమ్మద్ మర్షుల్ (29) అనే వ్యక్తి 103 కిలోల బాణసంచాను తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ బాణసంచాను విక్రయించాలని భావించాడు.

సదర్ బజార్ ప్రాంతంలోని తెలివారా చౌక్ లో గత రాత్రి పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు మొహమ్మద్ మర్షుల్ వద్ద ప్లాస్టిక్ బ్యాగుల్లో ఏవో ఉన్నట్లు గుర్తించారు. వాటిని తనిఖీ చేయగా అందులో బాణసంచా ఉంది. అవి 103 కిలోల బరువు ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీంతో అతడిని అరెస్టు చేసినట్లు వివరించారు. అతడు వారం రోజుల క్రితమే సదర్ బజార్ ప్రాంతంలో ఓ గోడౌన్ ను అద్దెకు తీసుకున్నాడని చెప్పారు.

అతడు బిహార్ లోని ఖగారియా ప్రాంతం నుంచి ఢిల్లీకి వచ్చి ఉంటున్నాడని వివరించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి అతడు బాణసంచా కొని ఢిల్లీకి తీసుకొచ్చాడని తెలిపారు. కాగా, 2023, జనవరి 1 వరకు ఢిల్లీలో అన్ని రకాల బాణసంచాల ఉత్పత్తి, అమ్మకాలు, వాడకాలపై ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) ఆదేశాలు జారీ చేసింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..