18 Safe Cities : దేశంలోనే 18 సురక్షిత నగరాలున్న రాష్ట్రం…ఏదంటే…
దేశంలోనే 18 సురక్షిత నగరాలున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో దేశంలోనే యూపీ 18 సురక్షిత నగరాలున్న రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వెల్లడించారు....

Women Safety Safe Cities
18 Safe Cities : దేశంలోనే 18 సురక్షిత నగరాలున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో దేశంలోనే యూపీ 18 సురక్షిత నగరాలున్న రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వెల్లడించారు. వచ్చే మూడు నెలల్లో అన్ని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, గౌతమ్ బుద్ధనగర్లను మొదటి దశలో సురక్షిత నగరాలుగా అభివృద్ధి చేయాలని, దీని కోసం అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సీఎం యోగి సమీక్షా సమావేశంలో ఆదేశించారు.
సేఫ్ సిటీ ప్రాజెక్టు
రెండో దశలో 57 జిల్లా కేంద్రాల మున్సిపాలిటీలు, ఆ తర్వాత మూడో దశలో 143 మున్సిపాలిటీలను సేఫ్ సిటీ ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని సీఎం యోగి కోరారు. అలాంటి అన్ని నగరాల ప్రవేశ ద్వారం వద్ద సేఫ్ సిటీ అనే సైన్బోర్డ్ను ఉంచడం ద్వారా ప్రత్యేక బ్రాండింగ్ కూడా చేయాలని సీఎం సూచించారు. ఈ విధంగా దేశంలోనే అత్యధిక సురక్షిత నగరాలు కలిగిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలుస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. (UP To Be 1st State)
మహిళల భద్రతకు ప్రాధాన్యం
మహిళల భద్రతతో పాటు (Focused On Women Safety), వృద్ధులు, పిల్లలు, దివ్యాంగుల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తామని సీఎం తెలిపారు. యూపీ రాష్ట్రంలో అమలవుతున్న సేఫ్ సిటీ ప్రాజెక్టు విస్తరణ కార్యాచరణ ప్రణాళికను సమీక్షించిన ముఖ్యమంత్రి అన్ని నగరాల అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. (18 Safe Cities) రాష్ట్రంలోని ప్రతి పౌరుడి భద్రత, అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ దిశగా గత ఆరేళ్లలో చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం పేర్కొన్నారు.
ప్రతి పౌరుడి భద్రతకు చర్యలు
రాష్ట్రంలోని ప్రతి పౌరుడి భద్రత, అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి మహిళ, ప్రతి వ్యాపారి సురక్షితంగా ఉన్నారని యోగి చెప్పారు. రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్నో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆధునిక కంట్రోల్ రూమ్లు, పింక్ పోలీస్ బూత్లు, ఆశాజ్యోతి కేంద్రాలు, సీసీ కెమెరాలు, మహిళా పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ కోసం హెల్ప్ డెస్క్లు, బస్సుల్లో ప్యానిక్ బటన్లు, ఇతర భద్రతా చర్యలను అమలు చేశామని ముఖ్యమంత్రి వివరించారు.
బిక్షగాళ్లకు పునరావాసం
సాంఘిక సంక్షేమ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ కలిసి భిక్షాటనలో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు క్రమపద్ధతిలో పునరావాసం కల్పించాలని కోరారు. సేఫ్ సిటీ భావన సాకారం కావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్ల వెరిఫికేషన్ అవసరమని, ట్యాక్సీలు, ఈ-రిక్షాలు, ఆటోలు, టెంపోల డ్రైవర్లకు ఈ విషయాన్ని నొక్కి చెప్పారు.