India Summons Pakistani Diplomat : పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు..సిక్కులపై దాడుల ఘటనపై నిరసన

పాకిస్థాన్ దేశంలో మైనారిటీలైన సిక్కులపై దాడులు జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ హై కమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో నివసిస్తున్న సిక్కులపై పెరుగుతున్న దాడులపై భారత్ వివరణ కోరింది....

India Summons Pakistani Diplomat : పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు..సిక్కులపై దాడుల ఘటనపై నిరసన

India Summons Pak Diplomat

Updated On : June 27, 2023 / 8:51 AM IST

India Summons Pakistani Diplomat : పాకిస్థాన్ దేశంలో మైనారిటీలైన సిక్కులపై దాడులు జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ హై కమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో నివసిస్తున్న సిక్కులపై పెరుగుతున్న దాడులపై భారత్ వివరణ కోరింది. సిక్కు కమ్యూనిటీపై జరిగిన దాడుల కేసును చిత్తశుద్ధితో దర్యాప్తు చేయాలని, దర్యాప్తు నివేదికను వీలైనంత త్వరగా తమకు పంపించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్ అధికారులను కోరింది. ( Lodges Strong Protest)

wanted criminal shot dead : యూపీలో వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్

సిక్కు కమ్యూనిటీ సభ్యులపై పెరుగుతున్న దాడుల సంఘటనలపై భారతప్రభుత్వం తన తీవ్ర అసంతృప్తిని తెలిపింది.(Over Attacks On Sikh Community) మైనారిటీల భద్రతను పాకిస్తాన్ నిర్ధారించాలని భారత్ డిమాండ్ చేసింది. అవసరమైతే సరిహద్దు వెంబడి దాడులు చేస్తామని భారతదేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించిన ఒక రోజు తర్వాత, భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తను పిలిపించింది.

Thanks Wagner Fighters : రష్యాలో రక్తపాతాన్ని నివారించినందుకు వాగ్నర్ ఫైటర్స్‌కు పుతిన్ కృతజ్ఞతలు

శనివారం గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సిక్కు కమ్యూనిటీ సభ్యుడు మరణించాడు. శనివారం కక్షల్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురైన వ్యక్తిని మన్మోహన్ సింగ్‌గా గుర్తించారు. తరచూ పాకిస్తాన్‌లో సిక్కు వర్గం లక్ష్యంగా హత్యలు పెరుగుతున్నందున, మైనారిటీ సంఘాలు, సిక్కులు అభద్రతా భావంతో ఉన్నారు. మైనారిటీలను రక్షించడంలో పాకిస్తాన్ ప్రభుత్వం వైఫల్యం చెందింది.