Indrakaran reddy: మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ నిర్వహించనున్న నేపథ్యంలో నేడు నాందేడ్ కు తెలంగాణ మంత్రి
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో నేడు నాందేడ్ కు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించాల్సిన సభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తారు. అంతేగాక, బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా పలు గ్రామాల్లోనూ ఆయన పర్యటిస్తారు. బీఆర్‌ఎస్ కు మద్దతు పలుకుతున్న నేతలను ఇంద్రకరణ్ రెడ్డి కలుస్తారు. బీఆర్ఎస్ సభకు ఆహ్వానిస్తారు.

Indrakaran Reddy
Indrakaran reddy: మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో నేడు నాందేడ్ కు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించాల్సిన సభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తారు. అంతేగాక, బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా పలు గ్రామాల్లోనూ ఆయన పర్యటిస్తారు. బీఆర్‌ఎస్ కు మద్దతు పలుకుతున్న నేతలను ఇంద్రకరణ్ రెడ్డి కలుస్తారు. బీఆర్ఎస్ సభకు ఆహ్వానిస్తారు.
ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పర్యటించారు. పలువురు మహారాష్ట్ర నేతలను కలిశారు. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రంలో నిర్వహించనున్న తొలి సభ కావడంతో దీన్ని విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు నేతలు ప్రసంగిస్తారు. ఈ సభకు మహారాష్ట్రతో పాటు తెలంగాణ సరిహద్దులోని ప్రజలను పెద్ద ఎత్తున తరలిస్తారు. కొన్ని వారాల క్రితమే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.