Police nabs college student: మైనర్ అమ్మాయిల వెంటపడుతూ ఫొటోలు తీస్తూ వేధిస్తున్న 17 ఏళ్ల బాలుడు.. అరెస్ట్

మైనర్ అమ్మాయిల వెంటపడుతూ వారి ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడు ఓ 17 ఏళ్ల బాలుడు. ప్రైవేటు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో 14 ఏళ్ల ఓ అమ్మాయి తాను ఎదుర్కొంటోన్న వేధింపుల గురించి తన తండ్రికి చెప్పింది. ఉత్తర ఢిల్లీలో ఈఘటన చోటుచేసుకుంది.

Police nabs college student: మైనర్ అమ్మాయిల వెంటపడుతూ ఫొటోలు తీస్తూ వేధిస్తున్న 17 ఏళ్ల బాలుడు.. అరెస్ట్

Loan Recovery Agents Arrested

Updated On : January 28, 2023 / 8:15 AM IST

Police nabs college student: మైనర్ అమ్మాయిల వెంటపడుతూ వారి ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడు ఓ 17 ఏళ్ల బాలుడు. ప్రైవేటు ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో 14 ఏళ్ల ఓ అమ్మాయి తాను ఎదుర్కొంటోన్న వేధింపుల గురించి తన తండ్రికి చెప్పింది. ఉత్తర ఢిల్లీలో ఈఘటన చోటుచేసుకుంది.

బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసులో విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. తనతో నిందితుడు అసభ్యరకరంగా మాట్లాడుతున్నాడని, ఫొటోలు పంపాలని ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు తమకు తెలిపిందని పోలీసులు వివరించారు.

కేసు నమోదు చేసుకున్నాక నిందితుడి మొబైల్ నంబరు ఆధారంగా అతడి లొకేషన్ గుర్తించామని, అతడు దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్నట్లు గుర్తించామని చెప్పారు. 14 ఏళ్ల బాలిక ప్రైవేటు ఫొటోలు తీసి, ఆమెను నిందితుడు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యాడని తెలిపారు. బాలికకు పదేపదే మెసేజ్ లు చేసేవాడని తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను మరిన్ని నగ్న ఫొటోలు పంపించాలని అడిగేవాడని చెప్పారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నట్లు వివరించారు.

Actor Tarakaratna Ill : నటుడు తారకరత్నకు అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు