తొలి టెస్టులో తప్పని పరాజయం.. రూట్ డబుల్ సెంచరీకి పైగా ఆధిక్యం

Team India: చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లీష్ జట్టులో టీమిండియాకు ఓటమి తప్పలేదు. 227పరుగుల ఆధిక్యంతో పర్యాటక జట్టు విజయాన్ని దక్కించుకుంది. సొంతగడ్డపై ఆశించినంత ప్రదర్శన చేయకపోవడంతో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యాన్ని చవిచూశారు. జో రూట్ డబుల్ సెంచరీ.. ఇంగ్లాండ్ జట్టును టచ్ చేయలేనంత దూరంలో నిలబెట్టింది. రెండు ఇన్సింగ్స్‌లు కలిపి అశ్విన్ (3+6)వికెట్లు పడగొట్టాడు.
420పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన.. ఇండియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 192పరుగులు మాత్రమే చేయగలిగింది. జేమ్స్ అండర్సన్(3/17), జాక్ లీచ్(4/76)రివర్స్ స్వింగ్ తో భారత జట్టును కుదేలు చేశారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చి అనూహ్యంగా పరాభవాన్ని ఎదుర్కొన్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కోహ్లి(72), ఓపెనర్ శుభ్‌మన్ గిల్(50) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేదు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీం డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో మెప్పించిన పంత్ సైతం రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే నిష్క్రమించాడు. ఛతేశ్వర్ పుజారా సైతం 15 పరుగులకే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఈ నేపథ్యంలో వరుస ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. కోహ్లి ఒంటరి పోరాటం వృథాగానే మిగిలిపోయింది.
తేడా మైదానాలలో ఉండి ఉండొచ్చు. ఆస్ట్రేలియా మైదానాల్లో మంచి బౌన్సింగ్ దొరకొచ్చు. ఐదు రోజులు అనుకూలంగా ఉంటుంది. ఊహించినంత ప్రతికూలత కనబరచకపోవడంతో బ్రిస్బేన్ లో బ్యాటింగ్ కు కలిసొచ్చింది.
స్కోరు వివరాలిలా ఉన్నాయి:
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 578
టీమిండియా మొదటి ఇన్నింగ్స్: 337
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 178
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 192
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: జో రూట్
England win the first @Paytm #INDvENG Test!#TeamIndia will look to bounce back in the second Test.
Scorecard ? https://t.co/VJF6Q62aTS pic.twitter.com/E6LsdsO5Cz
— BCCI (@BCCI) February 9, 2021