Amit shah slams kcr: అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు: అమిత్ షా

ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరై మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్నదే ప్రజల ఆకాంక్ష అని చెప్పారు.

Amit shah slams kcr: అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు: అమిత్ షా

Amit shah slams nitish kumar

Updated On : September 17, 2022 / 10:20 AM IST

Amit shah slams kcr: ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరై మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్నదే ప్రజల ఆకాంక్ష అని చెప్పారు.

తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోనే వేడుకలు జరపాలని, కొందరు ఇతర పేర్లతో జరుపుతున్నారని ఆయన విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా ఎందరో పోరాటం చేశారని ఆయన అన్నారు. హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాడారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని చెప్పారు.

ఆయనకు వేలవేల వందనాలు చెబుతున్నారని అమిత్ షా అన్నారు. పటేల్ లేకపోతే అఖండ భారత్ లక్ష్యం నెరవేరేది కాదని చెప్పారు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ విమోచన దినోత్సవం నిర్వహించలేదని అన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం రాజ్యంలో ఇక్కడ అరాచకాలు కొనసాగాయని చెప్పారు. పటేల్ పోలీస్ యాక్షన్ తోనే ఈ ప్రాంతానికి విముక్తి లభించిందని గుర్తు చేశారు. పటేల్ పోరాటంతో నిజాం తలవంచారని చెప్పారు.

India’s Active caseload: దేశంలో కొత్తగా 5,747 మందికి కరోనా.. ప్రస్తుతం 46,848 యాక్టివ్ కేసులు