Bus collides with truck: షిర్డీ సాయి భక్తులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఢీ.. 10 మంది మృతి.. మరో 10 మందికి గాయాలు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం షిర్డీ సాయిబాబా భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీ కొని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరో వ్యక్తి ఉన్నారు. మరో 10 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Bus collides with truck
Bus collides with truck: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం షిర్డీ సాయిబాబా భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీ కొని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరో వ్యక్తి ఉన్నారు. మరో 10 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నాసిక్-షిర్డీ హైవేపై పాఠారేకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. బస్సు షిర్డీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి ట్రక్కు బోల్తా పడి పూర్తిగా ధ్వంసమైంది. ప్రైవేటు బస్సు ముందు భాగం, అద్దాల ధ్వంసమయ్యాయి. బస్సులో చిక్కుకుపోయిన పలువురిని స్థానికులు, పోలీసులు బయటకు తీశారు.
ఈ ఘటనకు అతి వేగమే కారణమని తెలుస్తోంది. థానే జిల్లాలోని అంబర్నాథ్ నుంచి ప్రైవేటు లగ్జరీ బస్ అహ్మద్ నగర్ జిల్లాలోని షిర్డీ సాయిబాబా మందిరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. గాయాలపాలైనవారిని సిన్నార్ రూరల్ ఆసుపత్రి, యశ్వంత్ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.
MAKAR SANKRANTI: ‘మకర సంక్రాంతి’ పండుగ ఒకటే.. దేశం మొత్తం వేర్వేరు పేర్లతో ‘పొంగల్’