PM Modi dials Amit Shah : ఫ్రాన్స్ నుంచి అమిత్ షాకు మోదీ ఫోన్…ఢిల్లీ వరదలపై ఆరా

ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వరదల పరిస్థితిపై మోదీ అమిత్ షాను ఆరా తీశారు....

PM Modi dials Amit Shah : ఫ్రాన్స్ నుంచి అమిత్ షాకు మోదీ ఫోన్…ఢిల్లీ వరదలపై ఆరా

PM Modi dials Amit Shah

Updated On : July 14, 2023 / 8:49 AM IST

PM Modi dials Amit Shah : ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వరదల పరిస్థితిపై మోదీ అమిత్ షాను ఆరా తీశారు. ఢిల్లీలో వరదల వంటి పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటన నుంచి కేంద్ర హోం మంత్రికి డయల్ చేశారు.

Pak woman Seema Haider : ‘గదర్’ ప్రేమకథా చిత్రం అంటే నాకెంతో ఇష్టం…పాక్ మహిళ సీమా హైదర్ వెల్లడి

ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వరదల పరిస్థితి గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. (Enquires about Delhi flood like situation) రాబోయే 24 గంటల్లో యమునాలో నీటి మట్టం తగ్గుతుందని భావిస్తున్నట్లు అమిత్ షా ప్రధానికి చెప్పారు. (PM Modi dials Amit Shah from France) రాబోయే 24 గంటల్లో యమునా నదిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కలిసి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని షా మోదీకి వివరించారు.

PM Modi Big Announcements : వర్క్ వీసాలు, కొత్త కాన్సులేట్…ఫ్రాన్సులో మోదీ ప్రకటన

తగినంత సంఖ్యలో ఎన్‌డిఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు ఉన్నాయి. రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయ బృందాలను మోహరించామని అమిత్ షా చెప్పారు. ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది నుంచి వచ్చే వరద నీరు గురువారం ఢిల్లీలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది.

PM Modi : మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ప్రదానం

వరదల వల్ల సాధారణ ప్రజల జీవితాన్ని గజిబిజి చేసింది. జూలై 16 వతేదీ వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించారు. బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌లో ఉన్నారు.