సంవత్సరం ప్రయాణించి మహారాష్ట్ర నుంచి కేరళ చేరుకున్న 74 చక్రాల ట్రక్

Truck 1 year journey : అందరికీ తెలియకపోవచ్చు గానీ.. రోడ్ ట్రిప్‌లు చేసేవాళ్లకు కచ్చితంగా కనిపిస్తాయి. రోడ్లపై నత్తనడకతో నిదానంగా కదులుతూ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటాయి. అలా ఇండియన్ రోడ్లపై 1700కిలోమీటర్లు ప్రయాణించిందో ఓ ట్రక్.. అంత పెద్ద ట్రక్ బరువు తీసుకెళ్లడానికి చేసిన సంవత్సర ప్రయాణం సాగిందిలా..
Volvo FM 12 Puller జులై 2019లో మహారాష్ట్రలోని నాశిక్ నుంచి కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు బయల్దేరింది. సమాంతరంగా ఉండే ఆటోక్లేవ్ తో భారీ వాహనంలో ప్రయాణించింది. రోజుకు ఇది సగటున 5కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదు. అంటే 1700కిలోమీటర్లు ప్రయాణించడానికి 340రోజుల సమయం పడుతుందన్నమాట.
పైగా మధ్యలో కొవిడ్-19 ఎఫెక్ట్ ఒకటి. అలా ఈ ప్రయాణానికి రెండు నెలలు బ్రేక్ పడింది. అంత పెద్ద కార్గోను రెండు యాక్సెల్స్‌తో లాగారు. 32చక్రాలు ఉండే రెండు యాక్సెల్ కలిపి.. మరో పుల్లర్ ను యాడ్ చేశారు. మొత్తం 74 చక్రాలతో (10+78) టన్నుల బరువుతో ప్రయాణించింది.
7.5మీటర్ల ఎత్తు, 6.65మీటర్ల వెడల్లు ఉన్న మెషీన్ బరువు దాదాపు 70కిలోలకు పైగా ఉన్నప్పటికీ హైవేలపై ప్రయాణించగలిగింది. అంత స్పేస్ కవర్ చేసి వెళ్తుంటే ఇతర వాహనాలకు ఆటంకంగా మారేది. కొన్నిసార్లు ట్రాఫిక్ ను స్తంభింపజేసిన సందర్భాలు కూడా ఉన్నాయట.
కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ లైన్లు తెగిపోవడం, చెట్టు విరిగి కిందపడటం వల్ల ట్రక్ కాసేపు ఆగిపోవాల్సి వచ్చేది. ఈ ట్రాన్స్‌పోర్ట్ ఏకంగా 32మంది స్టాఫ్ తో కలిసి సేఫ్ గా 1700కిలోమీటర్ల ప్రయాణం సాగింది.