చైనాలో కరోనా కేసులు వేలల్లో కాదు.. 2.3 లక్షల్లోనే ఉండొచ్చు… హాంగ్ కాంగ్ పరిశోధకులు

ప్రపంచంలో తొలుత కరోనా వైరస్ ఉద్భవించిన చైనాలో కరోనా కేసులపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు సైతం చైనా చెప్పే కరోనా లెక్కలను నమ్మే
పరిస్థితి లేదు. కరోనా ముందుగా వ్యాప్తి చెందిన చైనాలో కరోనా కేసుల కంటే ఇతర ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు లక్షల్లో నమోదయ్యాయి. అదే చైనాలో మాత్రం
వేలసంఖ్యలోనే పరిమితమయ్యాయి. కరోనా కేసులు 55,508 అంటూ డ్రాగన్ అధికారిక గణాంకాలుగా చెబుతోంది. అసలు చైనాలో కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయి.
ఎంత మంది మృతిచెందారో కచ్చితమైన గణాంకాలను డ్రాగన్ దాచిపెడుతోందనే అనుమానం ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. వాస్తవానికి చైనాలో కరోనా కేసులు, మృతులు
చూపించే అధికారిక గణాంకాల కంటే 4 రెట్లు అధికంగా ఉండొచ్చునని అంటున్నారు హాంగ్ హాంగ్ యూనివర్శిటీ రీసెర్చర్లు.
Hong Kong University’s School of Public Health అంచనా ప్రకారం.. చైనాలో Covid-19 కేసులు ఫిబ్రవరి 20 నాటికి అత్యధికంగా 2 లక్షల 32వేల కేసులు వరకు ఉంటాయని వెల్లడించింది. అంటే.. చైనా చూపించిన 55,508 అధికారిక గణాంకాల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా చెప్పవచ్చు. కానీ, ఇప్పుడు చైనా కరోనా ధ్రువీకరణ కేసులను 83వేలుగా వెల్లడించింది. పరిశోధన పద్ధతి ప్రకారం పరిశీలిస్తే… చైనాలో కొవిడ్ కేసులను రివీజ్ చేసింది. ఈ మెథడ్ ప్రకారం లెక్కిస్తే.. జనవరి 15, మార్చి 3 మధ్యలో చైనా కరోనా కేసులు 7 రెట్లు ఎక్కువగా ఉంటాయని అధ్యయనం గుర్తించింది. మొదటి నాలుగు రివిజిన్స్‌లో డ్రాగన్ కరోనా కేసులు 2.8 రెట్ల నుంచి 7.1 రెట్లు వరకు పెరిగినట్టు రీసెర్చర్లు గుర్తించారు.
అంతకుముందు అంచనాల ప్రకారం లెక్కిస్తే.. రీసెర్చర్లు ఐదోసారి రివైజ్ చేసిన గణాంకాల్లో కరోనా కేసులు ఫిబ్రవరి 20 నాటికి 2 లక్షల 32వేలుగా నమోదైనట్టు తేల్చేశారు. కరోనా కేసుల లెక్కలపై చైనా ఎంత పారదర్శకంగా ఉందనే దానిపై ఈ తాజా అధ్యయనంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందే ఈ నెలలో చైనా కరోనా మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించింది. వుహాన్‌లో 1,290 కరోనా మరణాలు కలిపి రివైజ్ చేసింది. దీంతో 50 శాతం పెరిగిన కరోనా మరణాల సంఖ్య 3,869 కు చేరినట్టు వెల్లడించింది. ఇదివరకే యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు.. చైనా దాచిపెట్టిన కరోనా పాజిటివ్ కేసులు, మరణాలపై అమెరికాలో వైట్ హౌస్‌కు క్లాసిఫైడ్ రిపోర్టులో అందించాయి.
చైనా కరోనా గణాంకాలపై పలు న్యూస్ పబ్లికేషన్స్ కూడా రివీల్ చేశాయి. కరోనా కారణంగా మొన్నటివరకూ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న చైనా, అమెరికా మధ్య సంబంధాలు మరింత సన్నగిల్లినట్టయింది. ఇతర ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ వ్యాపించకముందే చైనా ఎందుకు అడ్డుకోలేదు అనే వాదన బలంగా వినిపిస్తోంది. చైనా చేసిన తప్పిదం కారణంగానే ఇప్పుడు ప్రపంచమంతా కరోనాతో పోరాడాల్సి వస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తగిన పర్యవసాన్ని చైనా ఎదురోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.