Mexico : మెక్సికో తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల పురాతన సమాధి లభ్యం
మెక్సికో దేశంలో వెయ్యి సంవత్సరాల పురాతన సమాధి తాజాగా వెలుగుచూసింది. దక్షిణ మెక్సికోలో బహుళ బిలియన్ డాలర్ల టూరిస్ట్ రైలు నిర్మాణానికి తవ్వకాలు సాగిస్తుండగా 1000 సంవత్సరాల పురాతన సమాధి బయటపడింది....

Ancient Grave Found In Mexico
Mexico : మెక్సికో దేశంలో వెయ్యి సంవత్సరాల పురాతన సమాధి తాజాగా వెలుగుచూసింది. దక్షిణ మెక్సికోలో బహుళ బిలియన్ డాలర్ల టూరిస్ట్ రైలు నిర్మాణానికి తవ్వకాలు సాగిస్తుండగా 1000 సంవత్సరాల పురాతన సమాధి బయటపడింది. (1,000 Years Old Ancient Maya Grave Found) చియాపాస్ రాష్ట్రంలోని పాలెన్క్యూ శిధిలాల సమీపంలో ఒక హోటల్ నిర్మాణానికి తవ్వుతుండగా మెక్సికన్ పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సమాధిని కనుగొన్నారు.
అత్యంత పురాతన మైన ఈ సమాధిలో మానవ శరీరాన్ని కనుగొన్నారు. (Grave Found In Mexico) బీచ్ రిసార్ట్‌లకు పర్యాటకులను ఆకర్షించడానికి ఈ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ సమాధిలోని అస్థిపంజర అవశేషాలను నగర కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో విశాల ప్యాలెస్ వద్ద రాతి పెట్టెలో కనుగొన్నారు.
South Korea : ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా భారీ సైనిక కవాతు
పెట్టెలో మూడు సిరామిక్ పాత్రలు, చెవి మంటలు, ఒక జత గ్రీన్‌స్టోన్ పూసలు కూడా ఉన్నాయి. మృతదేహం లక్షణాలను గుర్తించడానికి మరిన్ని పరిశోధనలు చేయనున్నారు. పాలెన్క్యూ దక్షిణ మెక్సికో, మధ్య అమెరికా భాగాల చుట్టూ ఉన్న పురాతన నగరాల్లోలాగా అభివృద్ధి చెందింది.