Red Corner Notice : ఖలిస్థాన్ ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ కరణ్‌వీర్ సింగ్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ

ఖలిస్థాన్ ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ కరణ్‌వీర్ సింగ్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు కరణ్‌వీర్ సింగ్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అయిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చింది....

Red Corner Notice : ఖలిస్థాన్ ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ కరణ్‌వీర్ సింగ్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ

Terrorist Karanvir Singh

Updated On : September 26, 2023 / 7:40 AM IST

Red Corner Notice : ఖలిస్థాన్ ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ కరణ్‌వీర్ సింగ్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు కరణ్‌వీర్ సింగ్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అయిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చింది. (Interpol Issues Red Corner Notice) ప్రస్థుతం కరణ్‌వీర్ సింగ్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడని భారత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

South Korea : ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా భారీ సైనిక కవాతు

ఇంటర్‌పోల్ ఖలిస్తానీ నాయకుడి కోసం రెడ్ కార్నర్ నోటీసును జారీ చేయడం ద్వారా తన వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసింది. (Wanted Khalistani Terrorist Karanvir Singh) ఇతను పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాకు చెందిన వాడు. కరణ్ సింగ్ పై క్రిమినల్ కుట్ర, హత్య, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టానికి సంబంధించిన నేరాలు, ఉగ్రవాద చర్యలకు నిధులు సేకరించడం లాంటి నేరాలున్నాయి.

Canada : భారత్‌లో కెనడీయన్లు జాగ్రత్తగా ఉండండి…కెనడా సలహా

అంతకుముందు విదేశాలలో నివసిస్తున్నట్లు భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై ఇంటర్‌పోల్ అన్ని సభ్య దేశాలకు రెడ్ నోటీసు జారీ చేసింది. విదేశాలకు పారిపోయినట్లు భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంలో రోహ్‌తక్ పోలీసులు విజయం సాధించారని హర్యానా పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. న్యూఢిల్లీ, ఒట్టావా మధ్య దౌత్యపరమైన గొడవల మధ్య వాంటెడ్ ఖలిస్థానీ అనుకూల నేతపై రెడ్ కార్నర్ నోటీసు వచ్చింది.