Pigeons Disappear: రేసులో పాల్గొన్న 10వేల పావురాలు మాయం
యూకేలోని పీటర్‌బొరోలో పాల్గొన్న 10వేల పావురాలు కనిపించకుండాపోవడం మిస్టరీగా మిగిలింది. శనివారం జరిగిన ఈ 270కిలోమీటర్ల రేసులో తమ పావురాల ఆచూకీ కనిపించకుండా పోయాయని లబోదిబోమంటున్నారు.

Pigeons
Pigeons Disappear: యూకేలోని పీటర్‌బొరోలో పాల్గొన్న 10వేల పావురాలు కనిపించకుండాపోవడం మిస్టరీగా మిగిలింది. శనివారం జరిగిన ఈ 270కిలోమీటర్ల రేసులో తమ పావురాల ఆచూకీ కనిపించకుండా పోయాయని లబోదిబోమంటున్నారు. ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన పావురాలే ఈ రేసులో పాల్గొంటాయి. నిర్దిష్ట దూరం తర్వాత అవి తిరిగి ఇంటికి వచ్చేస్తాయి.
ఈ రేసులో పాల్గొనడానికి ప్రత్యేకమైన జాతికి చెందిన పావురాలనే ఉపయోగిస్తారు.
కొందరు ఓనర్లు మేఘాల్లో తుఫాను సూచనలు ఉండటం వల్లనే అవి మిస్ అయి ఉండొచ్చని చెబుతున్నారు. 9వేలకు పైగా పావురాలు ఇంగ్లాండ్ లోని నార్త్ ఈస్ట్ ప్రాంతం నుంచి వచ్చాయి. వాటిల్లో 40శాతం వరకూ తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. మిస్ అయిన మొత్తం పక్షుల సంఖ్య లెక్కకు దొరకలేదు. అవి దాదాపు 5వేల నుంచి 10వేల వరకూ ఉండొచ్చని అంచనా.
రేసు నుంచి 170మైళ్ల దూరంలో ఉండే రిచర్డ్స్ సాయెర్స్ అనే వ్యక్తి.. 300పక్షలు కనిపించలేదని చెబుతున్నాడు. ఒకవేళ అవి ఎవరికైనా దొరికితే వాటికి నివాసం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు.
పదివేలకు పైగా పావురాలు కనిపించకుండాపోయాయి. అవి అలసిపోయి ఉండొచ్చు. వాతవారణ పరిస్థితుల కారణంగా తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. అవి దొరికిన వారు ఎవరో ఒకరు ఇది చదువుతారనుకుంటున్నా. మీకేమైనా పావురాలు కనిపిస్తే వాటి కోసం కాస్త ఆహారం, నీళ్లు పెట్టండి. అవి రేసు పావురాలు. వాటి కాళ్లకు రింగులు ఉంటాయని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు.